- సింగరేణి విస్తరణకు కార్మిక సంఘాలు సహకరించాలి
- గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక నేతల శిక్షణ సమావేశంలో సీఎండీ
హైదరాబాద్, వెలుగు : సింగరేణి వ్యాపార విస్తరణలో కార్మిక సంఘాల సహకారం అవసరమని సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక నేతల నాలుగు రోజుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులు పూర్తి పని గంటలు పని చేస్తూ మెషీన్లను పూర్తిస్థాయిలో వినియోగించేలా కార్మిక సంఘాలు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఏడాది టార్గెట్72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కార్మికుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
వచ్చే ఐదేళ్లలో సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల టార్గెట్తో ముందుకు సాగుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్జి.వెంకటేశ్వర్ రెడ్డి, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ రాజకుమార్, ప్రాతినిథ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ ప్రసాద్ మాట్లాడారు.