- తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలను ట్రాక్ చేయాలంటున్న ఎనలిస్ట్ సునీల్ గుర్జార్
- లిస్టులో హెరిటేజ్, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ఎన్‌సీసీ, ఆంధ్రా షుగర్స్..
- రానున్న ఐదేళ్లలో ఈ కంపెనీలకు పెరగనున్న అవకాశాలు!
బిజినెస్ డెస్క్, వెలుగు : కేంద్ర సంక్ణీర్ణ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కీలకంగా మారనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలకు రానున్న ఐదేళ్లలో వివిధ బెనిఫిట్స్ దక్కుతా యని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 25 కంపెనీలను ట్రాక్ చేయాలని సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న మార్కెట్ ఎనలిస్ట్ సునీల్ గుర్జార్ సలహా ఇచ్చారు. గత ఐదు సెషన్లలో 55 శాతం పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఈ లిస్టులో ఉంది. ఈ కంపెనీ టీడీపీ అధినేత, కాబోయే ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడికి చెందినది. సునీల్ గుర్జార్ రికమండ్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీల లిస్ట్ కింద ఉంది.
1. ఆంధ్రా షుగర్: షుగర్‌ను ఎగుమతి చేసే ఈ కంపెనీ పశ్చిమ గోదావరిలోని తణుకులో 1952 లో మొదలయ్యింది. కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఫార్మా బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 2023–24 లో ఆంధ్రా షుగర్‌కు రూ.1,150 కోట్ల రెవెన్యూ, రూ.53.27 కోట్ల నికర లాభం వచ్చింది.
2. కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్: రోడ్లు, ఇరిగేషన్, హైవేల నిర్మాణాలను చేపట్టే కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.4,090.98 కోట్ల రెవెన్యూ వచ్చింది. కంపెనీ నికర లాభం రూ.493.83 కోట్లుగా ఉంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ సర్వీస్‌లను అందించే కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ 1995 లో ఏర్పాటయ్యింది.
3. లిఖిత ఇన్‌ఫ్రా: ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల కోసం పైప్‌లైన్లను ఈ కంపెనీ నిర్మిస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో లిఖిత ఇన్‌ఫ్రాకు రూ.422.09 కోట్ల రెవెన్యూ, రూ.66.03 కోట్ల నికర లాభం వచ్చింది.
4. ఎన్‌ఎండీసీ: ఐరన్ ఓర్‌ను ఉత్పత్తి చేసే ప్రభుత్వ కంపెనీ ఎన్‌ఎండీసీకి కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.21,294 కోట్ల రెవెన్యూ వచ్చింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.5,632 కోట్లుగా ఉంది. కాగా, ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఉంది.
5. ఎన్‌సీసీ : కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎన్‌సీసీ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.20,844 కోట్ల రెవెన్యూ, రూ.735.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 1978 లో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుతం రియల్టీ, వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంట్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి వివిధ సెక్టార్లలో బిజినెస్ చేస్తోంది.
6. నైల్ లిమిటెడ్: లెడ్ అల్లాయ్స్‌ను తయారు చేసే నైల్ లిమిటెడ్ 1984 లో ఏర్పాటయ్యింది. ఈ కంపెనీకి చౌటుప్పల్, తిరుపతిలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి.
2023–24 లో నైల్ లిమిటెడ్‌కు రూ.837.62 కోట్ల రెవెన్యూ, రూ.31.6 కోట్ల నికర లాభం వచ్చింది.
7. ఆంధ్రా పెట్రో: ఆక్సో ఆల్కహాల్స్‌ను తయారు చేసే ఈ కంపెనీకి కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.788.67 కోట్ల రెవెన్యూ, రూ.63.4 కోట్ల నికర లాభం వచ్చింది.
8. పెన్నార్ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ ఆటో ఇండస్ట్రీస్ కోసం స్టీల్ సప్లయ్ చేస్తోంది. అలానే బిల్డింగ్స్ నిర్మాణంలో వాడే ప్రొడక్ట్‌లను తయారు చేస్తోంది. పెన్నార్ ఇండస్ట్రీస్‌కు కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.2,495 కోట్ల రెవెన్యూ, రూ.59.3 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది.
9. ఆంధ్రా పేపర్: పేపర్, పల్ప్‌ను తయారు చేసే ఆంధ్రా పేపర్‌కు 2023–24లో రూ.1,895 కోట్ల రెవెన్యూ, రూ.339 కోట్ల నికర లాభం వచ్చింది.
10. ఆల్కలి మెటల్స్: ఈ కంపెనీ ఇండస్ట్రియల్, స్పెషాలిటీ కెమికల్స్‌ను సప్లయ్ చేస్తోంది. 2023–24 లో రూ.83.8 కోట్ల రెవెన్యూ, రూ.1.1 కోట్ల నికర లాభం సాధించింది.
11. వీటితో పాటు హెరిటేజ్ ఫుడ్స్, అంజని ఫుడ్స్, డెక్కన్ సిమెంట్, క్రేన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బీజీఆర్ ఎనర్జీ, కోస్టల్ కార్పొరేషన్, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, రామ్కో గ్రూప్, ఎన్‌సీఎల్, అమర రాజా బ్యాటరీస్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీల షేర్లను కూడా ట్రాక్ చేయాలని సునీల్ గుర్జార్ సలహా ఇచ్చారు.