నిజాంపట్నంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

నిజాంపట్నంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

అసనీ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ పట్నం, కాకినాడ, మచిలీపట్నం తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అమరావతి, బాపట్ల జిల్లా తీరప్రాంతంలో కూడా వర్షాలు పడుతున్నాయి. బాపట్లలో 8 సెంటీమీటర్లు, వేటపాలెంలో 5.54 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల, రేపల్లే, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో వర్షం పడుతుంది. 

తుఫాన్ తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం హార్బర్ లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బాపట్ల కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలిచ్చారు.

తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాత్రి నుంచి విద్యుత్  సరఫరా నిలిచిపోయింది. రొయ్యల చెరువుల రైతులకు డీజిల్  దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేక గంటకు 6 లీటర్ల చొప్పున జనరేటర్ కు డీజిల్  అవుతుందంటున్నారు. మైపాడు బీచ్  దగ్గర సముద్రం 10 మీటర్లు ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది.