ఈ మధ్య కాలంలో ఇండ్లలో కంటే..నాగుపాములు బైకుల్లోకి దూరేందుకే ఎక్కువగా ఆసక్తిచూపిస్తున్నాయి. పార్క్ చేసిన బైకుల్లోకి వెళ్తూ..దర్జాగా ఉంటున్నాయి. తాజాగా ఓ నాగుపాము బైక్ లోకి దూరి..ఎంచక్కా అందులోనే ఉండిపోయింది. వాహనదారుడు గమనించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అతన్ని కాటేసేది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఓ నాగుపాము హల్ చల్ చేసింది. ద్విచక్ర వాహనంలోకి దూరి నానా హంగామా సృష్టించింది. బైక్ లో నాగుపామును స్థానికులు గమనించి బైక యజమానికి చెప్పడంతో అతను తప్పించుకున్నాడు. వెంటనే బైక్ ఆపేసి పక్కకు పారిపోయాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్మికుడు రాకేష్ చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు.