వామ్మో.. కిరాణా షాపులో దూరిన నాగుపాము.. గంటపాటు చుక్కలు చూపెట్టింది

మనలో చాలా మంది పాములంటే భయపడుతుంటారు. పాములున్న చోటకు వెళ్లడానికి అసలు సాహాసించరు. పొరపాటున పాముని చూస్తే అక్కడికి చచ్చిన కూడా పోరు. అసలు దాని పేరు ఎత్తడానికే భయపడుతారు. ఇలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు అనుకొని పరిస్థితుల్లో పాములు మానవ ఆవాసాలకు వస్తుంటారు. అవి ఆహారం, ఆవాసం కోసం చెట్లకు దగ్గరగా ఉన్న ఇళ్లు, షాపుల్లోకి వస్తుంటాయి. పాములు ఎలుకలను ఎక్కువగా తింటుంటాయి. పంటపోలాల్లో ఎక్కువగా కన్పిస్తుంటాయి. అప్పుడప్పుడు ఇళ్లు, షాపుల్లోకి కూడా పాములు వచ్చి హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటననే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

వేములవాడ పట్టణంలోని మెయిన్ రోడ్ పై ఉన్న ఓ కిరాణా షాపులో నాగుపాము హల్ చల్ చేసింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్ లోని తన దుకాణంలో నాగుపాము ఎలా ప్రత్యక్షమైందని షాపు యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. మెయిన్ రోడ్ కావడంతో పాము చుస్కేందుకు జనాలు భారీగా గూమిగూడారు. పాములు పట్టే వ్యక్తికి ఈ సమాచారాన్ని అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తికే.. ఆ పాము చుక్కలు చూపించింది. గంటపాటు దొరక్కుండా ఇబ్బంది పెట్టింది. నాగుపామును పట్టుకొని పట్టణ శివారులో వదిలిపెట్టారు. ఆ పాము దాదాపు 8 అడుగుల ఎత్తు ఉందని తెలిపారు. 

ALSO READ :- ఇప్పటివరకు 71వేల మంది ఎలక్షన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారు.. ఎట్లంటే..!