
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మహిళా నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన జాబ్ మేళాలో పలు కళాశాలల నుంచి 79 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు నాలుగు రౌండ్లలో ఇంటర్వ్యూలు చేపట్టారు.
మొదట ఆప్టిట్యూడ్ ఆన్ లైన్ టెస్ట్, అందులో సెలక్ట్ అయిన అభ్యర్థులకు పీడీటీ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఎన్ఎంటీ టెస్ట్ నిర్వహించారు. ఆ రౌండ్లలో ఎన్నికైన వారికి త్వరలో ఫైనల్ ఇంటర్వ్యూలు ఉంటాయని కోకాకోలా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆ సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళా నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించిన కోకాకోలా కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు.