- జూబిలెంట్ గ్రూప్‌తో అగ్రిమెంట్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌డ్రింకులు అమ్మే కోకా– కోలా తన ఇండియా బాట్లింగ్ బిజినెస్ హిందుస్తాన్ కోకా–కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌సీసీబీఎల్) లో 40 శాతం వాటాను జూబిలెంట్ భారతీయ గ్రూప్‌కు విక్రయించింది. డీల్ విలువను బయటపెట్టలేదు. కానీ, రూ.10 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. బ్రాండింగ్, ఇతర బిజినెస్‌లను చూసుకునే కోకా–కోలా ఇండియా 2023–24 లో రూ.4,713.38 కోట్ల రెవెన్యూపై రూ.420 కోట్ల నెట్ ప్రాఫిట్ సాధించింది.
బాటిల్స్‌ను తయారు చేసే హెచ్‌సీసీబీఎల్ రూ.14,022 కోట్ల రెవెన్యూపై రూ.2,808.31 కోట్ల నెట్ ప్రాఫిట్ పొందింది. కోకా–కోలా ఇండియా ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 42 శాతం పడిపోగా, హెచ్‌సీసీబీఎల్ ప్రాఫిట్ మాత్రం మూడు రెట్లు పెరిగింది. కోకా–కోలా, థంప్సప్, మాజా, కిన్లే, లిమ్కా, ఫాంటా వంటి ప్రొడక్ట్‌లను కోకా–కోలా గ్రూప్ అమ్ముతోంది.