ముగిసిన కోకా గాఫ్‌‌‌‌‌‌‌ పోరాటం.. ‌‌‌‌నాలుగో రౌండ్‌‎లోనే ఇంటిదారి

ముగిసిన కోకా గాఫ్‌‌‌‌‌‌‌ పోరాటం.. ‌‌‌‌నాలుగో రౌండ్‌‎లోనే ఇంటిదారి

న్యూయార్క్‌: డిఫెండింగ్ చాంపియన్‌‌, అమెరికా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‎లో నాలుగో రౌండ్‌‎లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో సీడ్ గాఫ్​ 3–6, 6–4, 3–6తో అమెరికాకే చెందిన  13వ సీడ్ ఎమ్మా నవరో చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌‌‌ల్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్‌‌‌‌‌) 6–2, 6–4తో మెర్టెన్స్ (బెల్జియం)ను, ఏడో సీడ్ క్విన్వెన్ జెంగ్ (చైనా) 7–6 (7/2), 4–6, 6–2తో చెక్ ప్లేయర్ డొనా వెకిచ్‌‌ను ఓడించి క్వార్టర్స్ చేరారు. 
 

మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో  నాలుగో సీడ్‌ జ్వెరెవ్ (జర్మనీ) 3–6, 6–1, 6–2, 6–2తో నకషిమ (అమెరికా)ను ఓడించి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌చేరగా.. ఆరో సీడ్‌‌‌‌‌‌ఆండ్రీ రబ్లెవ్‌‌‌‌‌‌(రష్యా) 3–6, 6–7 (3/7), 6–1, 6–3, 3–6తో  తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓడాడు. ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (డెన్మార్క్​) 6–3, 4–6, 3–6, 2–6తో అమెరికన్ టేలర్ ఫ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు.  మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో  రెండో సీడ్ రోహన్ బోపన్న (ఇండియా)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 1–6, 5–7తో  16 సీడ్ మొల్టెని–గొంజాలెజ్ (అర్జెంటీనా) చేతిలో ఓడారు.