ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో 46 కోట్ల విలువైన 3 కేజీల కొకైన్ సీజ్.. ఎలా దొరికిపోయాడంటే..

ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో 46 కోట్ల విలువైన 3 కేజీల కొకైన్ సీజ్.. ఎలా దొరికిపోయాడంటే..

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఫ్లైట్ నంబర్ G9-463 షార్జా నుంచి న్యూఢిల్లీ వచ్చిన విమానంలో 3 కేజీల 317 గ్రాముల కొకైన్తో వచ్చిన ఒక ప్రయాణికుడు డ్రగ్స్ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ దాటించే ప్రయత్నం చేశాడు. ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సదరు ప్రయాణికుడు అడ్డంగా దొరికిపోయాడు.

సీజ్ చేసిన కొకైన్ విలువ 46 కోట్ల 44 లక్షలకు పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కొకైన్ను తరలించేందుకు ప్రయత్నించిన ఆ యువకుడి వయసు 23 ఏళ్లు ఉంటుందని, ఆరు ప్యాకెట్లలో వైట్ కలర్ పౌడర్ రూపంలో కొకైన్ను బ్యాగ్ లోపల ఉంచి కుట్టేసి తరలించే ప్రయత్నం చేశాడని అధికారులు చెప్పారు.

Also Read : మరో వివాదంలో రాందేవ్ బాబా

ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఢిల్లీ కస్టమ్స్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కిలో 14 కోట్లు. ఎన్డీపీఎస్, కస్టమ్స్ యాక్ట్ కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 9న ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో నైట్ షిఫ్ట్లో ఉన్న కస్టమ్స్ అధికారులకు ఉగాండ నుంచి వచ్చిన ఈ డ్రగ్ పెడ్లర్ దొరికిపోయాడు. 

ఏప్రిల్ 7న ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో కేజీన్నర బంగారంతో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఏప్రిల్ 6న కూడా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 36 కేజీలకు పైగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి, ఆ గంజాయిని సీజ్ చేశారు.