కాక్లియర్ ​ఇంప్లాంట్ ..సర్జరీలతో అపోలో రికార్డ్

కాక్లియర్ ​ఇంప్లాంట్ ..సర్జరీలతో అపోలో రికార్డ్
  • 2500 ఆపరేషన్లతో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన ఆస్పత్రి  

హైదరాబాద్, వెలుగు :  వినికిడి సమస్యతో బాధపడేవారికి కాక్లియర్​ఇంప్లాంట్​సర్జరీలు చేసి హైదరాబాద్ అపోలో రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా 2,500 సర్జరీలు చేసి దేశంలో నెంబర్ వన్ హాస్పిటల్​నిలిచిందని డాక్టర్​ఈసీ వినయ్​కుమార్​తెలిపారు. 9 నెలల చిన్నారి నుంచి 87 ఏండ్ల వృద్ధుల వరకు సర్జరీలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపామని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్​లోని అపోలో హాస్పిటల్​లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 

1994లో అపోలో హాస్పిటల్​లో కాక్లియర్​ ఇంప్లాంట్​ ప్రోగ్రామ్​ ప్రారంభించామన్నారు. 2007లో  సీఎం వైఎస్ ఆర్ కు రిప్రజంటేషన్​ఇస్తే, రెండు వారాల్లోనే ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తుచేశారు.  ఒకేరోజు18 సర్జరీలు చేసి లిమ్కా బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లోనూ సృష్టించామని పేర్కొన్నారు. కాక్లియర్​ఇంప్లాంట్​ సర్జరీలు చేసిన పిల్లల్లో 95శాతం నార్మల్​ స్కూళ్లలోనే చదువుతున్నారన్నారు. డాక్టర్స్​ టీమ్​ను అపోలో జాయింట్​మేనేజింగ్​డైరెక్టర్​ సంగీతా అభినందించారు.  డాక్టర్​జస్విందర్​సింగ్​, రవీందర్​బాబు, ఈఎన్​టీ టీమ్, సర్జరీలు చేయించుకున్నవారు పాల్గొన్నారు.