రైల్ ​కోచ్ ​రెస్టారెంట్​ బిర్యానీలో బొద్దింక

 రైల్ ​కోచ్ ​రెస్టారెంట్​ బిర్యానీలో బొద్దింక
  • ప్రశ్నించిన కస్టమర్ల మీదనే రెస్టారెంట్ నిర్వాహకులు గరం

ట్యాంక్ బండ్, వెలుగు: నెక్లెస్​ రోడ్డులోని రైల్​ కోచ్ ​రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక వచ్చింది. అది చూసిన కస్టమర్​కంగుతిన్నాడు. విజయ్​ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్​తో కలిసి సోమవారం మధ్యాహ్నం నెక్లెస్ రోడ్డులోని రైలు కోచ్ రెస్టారెంట్​కు వెళ్లాడు. అందరికీ బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత బిర్యానీలో బొద్దింక కనిపించింది. నిర్వాహకులను పిలిచి ఇదేమిటని ప్రశ్నించగా, అతనిపైనే సీరియస్​అయ్యారు. 

దీంతో చేసేదేమీ లేక ఫ్రెండ్స్​తో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.