HYD: చికెన్ బిర్యానీలో బొద్దింక.. ఇదిగో వీడియో...

HYD: చికెన్ బిర్యానీలో బొద్దింక.. ఇదిగో వీడియో...

 ఈ మధ్య  హోటళ్లు, రెస్టారెంట్లలో తినాలంటే భయం వేస్తుంది... ఎందుకంటే ఈ మధ్య తినే ఆహారంలో బొద్దింకలు, పురుగులు దర్శనమిస్తున్న ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. . ఆ మద్య ఐస్ క్రీంలో చేతి వేలు కనిపించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా బిర్యానీలో బొద్దింకల వస్తున్న ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయి.  

లేటెస్ట్ గా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో  చికెన్  బిర్యాని తిన్న కస్టమర్ కు బొద్దింక వచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అతడు తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. బిర్యానీ తిన్న ప్లేట్ ను, హోటల్ బిల్లును షేర్ చేశాడు. ఫుట్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

శ్రీఖండే ఉమేశ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడీయన్ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో చిన్న చిన్న బొద్దింకలు ఉండడాన్ని గమనించిన అతను ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఎన్ని తనిఖీలు చేసినా.. హైదరాబాద్ లోని రెస్టారెంట్లు,హోటళ్లలో ఆహారం విషయంలో యజమానులు ఎలాంటి పరిశుభ్రత పాటించడం లేదని తెలిపాడు.  ఇలా తినే ఆహారంలో బొద్దింకలు వస్తున్నాయని చెప్పారు.  ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీడియోను పోస్ట్ చేశాడు.   

ఈ పోస్ట్ పై స్పందించిన  జీహెచ్ఎంసీ..  హైదరాబాద్ ఫడ్ సేఫ్టీ అధికారుల హోటల్ లో తనిఖీ చేసి..తగిన  చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా  ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు చేసినా తీరు మారడం లేదు. పలు హోటళ్లపై దాడులు  చేసి కేసులు నమోదు చేసినా మళ్లీ ఓపెన్ కావడంపై విమర్శలు వస్తున్నాయి.