
జనగామ, వెలుగు: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల క్యూటీక్యూ హోటల్ లో వడ్డించిన చికెన్బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లికి చెందిన వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేయగా వెయిటర్ వడ్డించాడు.
తింటుండగా బొద్దింక కనిపించడంతో అతను హోటల్నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మున్సిపల్శానిటరీ ఇన్స్పెక్టర్శేఖర్, ఎస్ఐ రాజేశ్ కుమార్హోటల్ కు చేరుకొని, విచారణ చేపట్టారు. హోటల్‌ను సీజ్ చేసి, నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్చెప్పారు.