హైదరాబాద్ సిటీ, వెలుగు: బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్‌లో సాంబార్ రైస్ లో బొద్దింక వచ్చింది. నగరానికి చెందిన రాణా గురువారం మధ్యాహ్నం హోటల్ కి వెళ్లి సాంబార్ రైస్ ఆర్డర్ చేశాడు. తింటుండగా బొద్దింక కనిపించడంతో షాక్ తిన్నాడు. హోటల్ నిర్వహకులను నిలదీయంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లయింట్ఇచ్చాడు. బేగంపేట్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మినర్వా హోటల్ కి వచ్చి శాంపిల్స్తీసుకుని నాచారంలోని ల్యాబ్ కు తరలించారు. రిపోర్ట్ ఆధారంగా హోటల్ నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు తెలిపారు.