వెజ్​ బిర్యానీలో బొద్దింక

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్​చేసిన వెజ్ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. రామంతాపూర్​కు చెందిన బాలు తన కూతురు కోసం స్విగ్గీలో ఆదివారం వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ తింటున్న క్రమంలో బొద్దింక కన్పించడంతో బాధితుడు ఇదేంటని మాస్టర్ చెఫ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు ఉప్పల్​పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. మాస్టర్ చెఫ్ రెస్టారెంట్​ను తనిఖీ చేసి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.