కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక.. కస్టమర్ల ఆందోళన

హైదరాబాద్: ఓ పక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా నాణ్యమైన ఫుడ్ అందించడంలో హోటళ్లు నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నాయి. తనిఖీలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే హోటళ్ల యాజమాన్యంలో మార్పులు రావడం లేదు.  తాజాగా కొత్త కోట కృ తుంగ రెస్టా రెంట్ లో బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోయారు.ఇదేందీ అని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో  ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. 

బుధవారం ( డిసెంబర్ 4) కృతుంగ రెస్టారెంట్ కు బిర్యానీ తిందామని వచ్చిన ఓ కస్టమర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. బిర్యానీ ఆర్డర్ చేసి కస్టమర్ మొదట స్టార్టప్ లు తిని .. బిర్యానీ తింటున్న క్రమంలో బొద్దింక చూసి షాక్ అయ్యాడు. పెద్ద హోటల్ అని వస్తే.. బిర్యానీలో బొద్దింక రావడంతో ఆందోళనకు గురయ్యారు. ఇదేంటని హోటల్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్లంతా ఆందోళనకు దిగారు. 

సిటీలో ఏ హోటల్ కైనా వెళ్లి భోజనం చేయాలంటేనే కస్టమర్లు జంకుతున్నారు. చిన్నిచిన్న హోటళ్లలోనే కాదు..పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత కరువైంది. పేరు కు పెద్ద.. ఊరు దిబ్బ అన్నట్లు హోటళ్ల పనితీరు కనిపిస్తోంది. కిచెన్ నిర్వహణలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబ డుతుంది. 

ALSO READ : తగ్గిన స్విగ్గీ నష్టం.. ఆ రేంజ్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు మరి..!

జిహెచ్ఎంసి అధికారులకు,ఫుడ్ సేఫ్టీ అధికారులకు  ఫిర్యాదు చేశానని తెలిపారు.అధికారులు 2 గంటల నుంచి 2రోజులలో మీ సమస్య పై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని మీడియా ముఖంగా తెలిపారు. రెస్టారెంట్ కిచెన్ లో మొత్తం ఫ్రొస్ట్ చికెన్,మటన్ ఉన్నాయని తెలిపారు. కిచెన్  అంతా దుర్గంధం వస్తుందని , రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని సందీప్ కోరారు.