హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్.3లోని ‘బిర్యానీ వాలా’ హోటల్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసి తింటున్న బిర్యానిలో బొద్దింక కావడంతో కస్టమర్లు గొడవ చేశారు. యాజమాన్యాన్ని ఇదేంటని కస్టమర్లు ప్రశ్నించారు. ‘బొద్దింక వస్తే మేం ఏం చేస్తాం’ అంటూ హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, కస్టమర్లు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై ఫోన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులను వివరణ కోరగా కస్టమర్ల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, తనిఖీలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఇటీవల పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్ ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క తనిఖీలు జరుగుతున్నప్పటికీ ‘బిర్యానీ వాలా’ హోటల్ యాజమాన్యం కస్టమర్ల ఆరోగ్యాన్ని గాలికొదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.