
ఎల్బీనగర్, వెలుగు: కొత్తపేటలోని జగవీస్ కృతుంగ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీకి చెందిన సందీప్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం కొత్తపేటలోని జగవీస్ కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ చికెన్ రోస్ట్ బిర్యానీ ఆర్డర్ చేసి, తింటున్న క్రమంలో అతడికి బొద్దింక ప్రత్యక్షమైంది. ఇదేంటని ప్రశ్నించిన బాధితుడికి రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్‌ను తనిఖీ చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.