హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ సాంబార్ రైస్ లో బొద్దింక..

ఈమధ్య హైదరాబాద్ లోని కొందరు రెస్టారెంట్ నిర్వహలు ఆహార పదార్థాలు తయారీ విషయంలో ఫుడ్ సేఫ్టీ నిభందనలు గాలికొదిలేస్తున్నారు. దీంతో ఆహారంలో బొద్దింకలు, బల్లులు, పురుగులు వంటివి దర్శనమిస్తున్నాయి. అయితే గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలోని మినర్వా రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు రాణా అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి వెళ్ళాడు. ఈ క్రమంలో సాంబార్ రైస్ ఆర్డర్ చేశాడు. 

ఈ సాంబార్ రైస్ లో బొద్దింక ప్రత్యక్షమవడంతో  ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీంతో ఇదేంటంని రెస్టారెంట్ మేనేజర్ ను నిలదీశాడు. అయినప్పటికీ మేనేజర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో రాణా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి కంప్లెయింట్  చేశాడు. అలాగే అపరిశుభ్రమైన వాతావరణంలో వంట చేసి.. కస్టమర్స్ ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే ఇలాంటి రెస్టారెంట్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్ గా చెకింగ్ చేసి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ALSO READ | ఫార్ములా ఈ రేసు కేస్: ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ