అయ్యో సగం తినేశాడే..! మిఠాయి వాలా చాట్ బండార్‌లో బొద్దింక

అయ్యో సగం తినేశాడే..! మిఠాయి వాలా చాట్ బండార్‌లో బొద్దింక

బిర్యానీలో ఎలుకలు.. చాట్ బండార్‌లో బొద్దింకలు.. కడుపారా తిందామని బయటకెళ్తున్న హైదరాబాద్ వాసులకు వింత వింత ఘటనలు ఎదురవుతున్నాయి.  తాజాగా, మిఠాయి వాలా స్వీట్ షాప్ చాట్ బండార్‌లో బొద్దింక దర్శనమిచ్చింది.

శుక్రవారం(ఆగష్టు 20) సాయంత్రం వేళ రవి అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి వనస్థలిపురంలో మిఠాయి వాలా షాపుకు వెళ్లారు. అక్కడ పిల్లలు చాట్ బండార్‌ కావాలని మారాం చేయడంతో వాటిని కొనుగోలు చేశారు. అనంతరం ఇంటికెళ్లి చాట్ బండార్‌ తింటుండగా ఒక దానిలో చచ్చిన బొద్దింక కనిపించింది. అది కూడా సగం తిన్నాక దర్శనమిచ్చింది. బొద్దింక వచ్చిన విషయాన్ని షాపు యజమానులు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు పిర్యాదు చేద్దామన్నా వారూ స్పదించలేదని బాధితుడు చెప్పుకొచ్చారు.