వింబుల్డన్‌..కొకో గాఫ్‌ ఔట్‌

వింబుల్డన్‌: అమెరికా టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్‌ కొకో గాఫ్‌కు వింబుల్డన్‌ తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో ఏడోసీడ్‌ గాఫ్‌ 4–6, 6–4, 2–6తో వరల్డ్‌ 128వ ర్యాంకర్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) చేతిలో కంగుతిన్నది.  

ఇతర మ్యాచ్‌ల్లో ఎలెనా రిబకినా (కజకిస్తాన్‌ 4–6, 6–1, 6–2తో రోజెర్స్‌ (అమెరికా)పై, ఆన్స్‌ జుబెర్‌ (ట్యూనీసియా) 6–3, 6–3తో ఫ్రెంచ్‌ (పోలెండ్‌)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్​) 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు.