మైసూరు: కాఫీడే ఫౌండర్, దివంగత వీజే సిద్ధార్థ ఇంట్లో మరో విషాదం. సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్డే(96) ఆదివారం చనిపోయారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చాలా కాలంగా కోమాలో ఉన్నారు. కొడుకు చనిపోయిన సంగతి కూడా ఆయనకు తెలియదు. కొద్ది రోజుల కిందట.. సూసైడ్ చేసుకోడానికి ముందు సిద్ధార్థ చివరిసారిగా తండ్రిని చూసి వెళ్లారు. కాఫీ రైతు అయిన గంగయ్య కొడుకు సిద్ధార్థ ‘కాఫీ డే’ వ్యాపారానికి అన్నిరకాలుగా సహకరించారు. గంగయ్య అత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు చెప్పారు.