న్యూఢిల్లీ: ఫ్రెషర్లకు ఏడాదికి రూ.2.52 లక్షల జీతం ఇస్తామని ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్, తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఫ్రెషర్లకు ఏడాదికి రూ.4–12 లక్షల జీతం ఇస్తామని, గతంలో చెప్పిన రూ.2.52 లక్షల యాన్యువల్ శాలరీ నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకని వివరించింది. అంతేకాకుండా శాలరీ ఇంక్రిమెంట్ ఒక శాతం ఉంటుందన్న ప్రకటనపై కూడా కాగ్నిజెంట్ విమర్శలు ఎదుర్కొంది.
ఇది కంపెనీ ఆఫర్ చేసిన ఇంక్రిమెంట్ 1–5 శాతంలో లోవర్ బ్యాండ్ అని ఈ ఐటీ కంపెనీ పేర్కొంది. ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ బట్టి ఇంక్రిమెంట్ ఉంటుందని తెలిపింది. కాగా, వివిధ రోల్స్ కోసం ఫ్రెష్ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతీ ఏడాది కాగ్నిజెంట్ నియమించుకుంటోంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను కీలకమైన పోస్టులలో నియమించుకుంటామని, వీరిపై భారీగా ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది.