140 మంది ఉద్యోగులకు.. రూ.14 కోట్ల బోనస్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న AI స్టార్టప్ కంపెనీ

140 మంది ఉద్యోగులకు..  రూ.14 కోట్ల బోనస్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న AI స్టార్టప్ కంపెనీ

స్టార్టప్ కంపెనీలో జాబ్ అంటే ఉద్యోగుల్లో చాలా డౌట్స్ వస్తాయి.. ఎప్పటి వరకు ఉంటుందో.. సక్సెస్ అవుతుందో లేదో.. జీతాలు సరిగా ఇస్తారో లేదో అనే భయం.. ఇలాంటి భయాలనే ఆ కంపెనీ ఉద్యోగులు కూడా మూడేళ్ల క్రితం ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఆ కంపెనీ ఓనర్ ఇచ్చిన మాట.. ఇప్పుడు ఆ ఉద్యోగులను లక్షాధికారులను చేసింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌కు చెందిన కోవై అనే కంపెనీ.. AI  సొల్యూషన్స్ ఇస్తుంది. 2011లోనే ఈ కంపెనీ ప్రారంభించిన.. నాలుగేళ్ల క్రితం AI ఆధారిత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 140 మంది ఉద్యోగులను తీసుకున్నది ఈ కంపెనీ.

కోవై కంపెనీ యజమాని శ్రవణ్ కుమార్.. లండన్‪లో ఉంటారు.. అక్కడే సెటిల్ అయ్యారు. తన సొంతూరు కోయంబత్తూరులో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం AI ఆధారితంగా కౌడ్ సర్వీసెస్, ఇతర ఏఐ సేల్స్ సర్వీసెస్ అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం అధిక జీతాలతో ఉద్యోగులకు మంచి ఆఫర్స్ వచ్చాయి.. డబుల్ జీతం ఇస్తామని చాలా మంది ఉద్యోగులకు మరో కంపెనీల నుంచి పిలుపు వచ్చింది. ఆ అప్పుడు శ్రవణ్ కుమార్ ఓ మాట ఇచ్చాడు. నాకు మూడేళ్ల సమయం ఇవ్వండి.. మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాను.. జీతాలు భారీగా ఇస్తాను.. మంచిగా చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 140 మంది ఉద్యోగులు.. ఓనర్ శ్రవణ్ కుమార్ మాటలు నమ్మారు. 

ALSO READ | Tech : AIపై గూగుల్ 7 వేల 500 కోట్ల పెట్టుబడులు : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు

ఈ మూడేళ్లలో బీబీసీ, బోయింగ్ వంటి కంపెనీల నుంచి మంచి డీల్స్ వచ్చాయి కంపెనీకి. దీంతో 2025 జనవరిలో ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఓనర్ శ్రవణ్ కుమార్. 140 మంది ఉద్యోగులకు 14 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఆరు నెలల జీతాన్ని బోనస్ గా అందించారు. ఓ ఉద్యోగి అత్యధికంగా 16 లక్షల 20 వేల రూపాయల బోనస్ అందుకున్నారు.

స్టార్టప్ కంపెనీ అంటేనే ఉద్యోగుల్లో చాలా భయాలు, అనుమానాలు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ.. ఉద్యోగులకు భరోసా ఇస్తూ.. కంపెనీ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇలాంటి మేనేజ్ మెంట్ ఉంటే ఉద్యోగాలు ఎందుకు మానేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఉద్యోగి మూడేళ్లలో 16 లక్షల బోనస్ అంటే.. మంచి గుర్తింపే అంటున్నారు. అది కూడా ఓ స్టార్టప్ కంపెనీలో అంటూ కంపెనీ ఓనర్ కు హ్యాట్సా్ప్ చెబుతున్నారు.