హైదరాబాద్, వెలుగు: క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ కాయిన్ స్విచ్ క్రిప్టో కరెన్సీపై వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు పది భారతీయ భాషల్లో బిట్కాయిన్వైట్పేపర్ను విడుదల చేసింది. ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో సెమినల్ బిట్ కాయిన్ పేపర్ ను అనువదించినట్టు పేర్కొంది. దీనివల్ల లక్షల మంది వినియోగదారులు క్రిప్టోలు, బిట్ కాయిన్ గురించి ప్రాథమిక విషయాల్ని కూడా వారి మాతృభాషలో తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడిందని స్విచ్కాయిన్ తెలిపింది.
బిట్ కాయిన్ రికార్డ్-బ్రేకింగ్ దిశగా దూసుకెళ్తోంది. ఇటీవల ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 99,500 డాలర్లకు చేరుకుంది. రాబోయే ట్రంప్ప్రభుత్వం క్రిప్టోకు అనుకూల వైఖరిని అనుసరిస్తుందనే అంచనాలే ఇందుకు కారణం. ఈ సందర్భంగా కాయిన్ స్విచ్ బిజినెస్ హెడ్ బాలాజి శ్రీహరి మాట్లాడుతూ మనదేశంలో క్రిప్టోను అందరికి అందించాలనే ప్రయత్నంలో భాగంగానే భారతీయ భాషల్లో వైట్పేపర్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.