మంచు దుప్పటిలో ఇందూర్

భిక్కనూరు/ బోధన్/నిజామాబాద్, వెలుగు:-కొద్ది రోజులుగా ఇందూరు జిల్లాలో చలి పెరిగింది.. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచి దుప్పట్లు తొలగలేదు.   నిజామాబాద్​సిటీలో ఎటు చూసినా పొగ మంచు కమ్ముకుంటోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.  బోధన్​ పట్టణంలో మంచు కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు కురువడంతో పట్టణంలోని రోడ్లపై దారి కనిపించకుండా పోయింది.

మంచుతో పాటు చలితీవ్రత ఎక్కువగాఉండడంతో ప్రజలు బయటకు రాలేక పోతున్నారు. పదిగంటల వరకు  కూడా చలి తీవ్రత తగ్గడంలేదని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.  భిక్కనూర్​ మండల కేంద్రంలో శుక్రవారం పొగ మంచు  కమ్ముకుంది.  ఉదయం 6 గంటల తర్వాత కూడా  మంచు తగ్గలేదు. చలి పెరగడంతో ప్రజలు వణుకుతున్నారు.ఉదయం కూలి పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.