ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలైనా రోడ్లపై మంచుతెరలు వీడడం లేదు. నిజామాబాద్‌‌లో మధ్యాహ్నం టైంలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా సాయంత్రానికి 12 డిగ్రీలకు చేరుకుంది. కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. శనివారం నస్రుల్లాబాద్​మండలంలో 11.4 డిగ్రీలు,  గాంధారి మండలం రాం లక్ష్మన్‌‌పల్లిలో 11.5 డిగ్రీలు, మద్నూర్​ మండలం డొంగ్లి,  నస్రుల్లాబాద్ మండలం బొమ్మదేవునిపల్లిలో 11.7 , మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 12.6 , లింగంపేటలో 12.7 , జుక్కల్, మెనూర్‌‌‌‌లో 13 , బిచ్కుంద, రామారెడ్డిలో 13.2 డిగ్రీలు, మాచాపూర్‌‌‌‌లో 13.5, దోమకొండ, బీబీపేటల్లో 13.9, పాతరాజంపేటలో 14.8, హసన్​పల్లిలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చలి తీవ్రత నుంచి తట్టుకుంనేందుకు చాలా మంది చలి మంటలు కాగుతున్నారు. 

- వెలుగు, నిజామాబాద్‌/కామారెడ్డి

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

కామారెడ్డి, వెలుగు: ఝాన్సీ లక్ష్మీబాయి  జయంతిని పురష్కరించుకుని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్ర్తీ శక్తి దివస్ నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్​హైస్కూల్​ చిన్నారులు ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో  ఆకట్టుకున్నారు. స్కూల్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ప్రోగ్రామ్‌‌లో పలువురు వక్తలు మాట్లాడుతూ లక్ష్మీబాయి స్ఫూర్తిగా ముందుకెళ్లాలన్నారు. డాక్టర్ రాధరమణ,  రణజిత్ మోహన్, భాస్కర్‌‌‌‌రావు, నరసింహాం, నగేశ్ పాల్గొన్నారు.  

బీజేవైఎం ఆధ్వర్యంలో...

పిట్లంలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ సంఘం ప్రెసిడెంట్ శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను ఎదురించి పోరాడిన వీరవనిత లక్ష్మీబాయి అని కొనియాడారు. కార్యక్రమంలరో నాయకులు శ్రీరాం, గైని సాయిలు, హన్మాండ్లు మోగులగొండ, రాజు, రాములు, గణేష్​ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు కరాటే నేర్చుకోవాలి

బోధన్: ఆత్మరక్షణ కోసం మహిళలు కరాటే నేర్చుకోవాలని ఎమ్మెల్యే షకీల్​ సతీమణి అయేషా ఫాతిమా అన్నారు. పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళ్లుర్పించారు. అనంతరం కరాటేలో నేషనల్ గోల్డ్​మెడల్ చాంఫియన్ ఫిప్  సాధించిన పల్లవిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గాండ్ల సుధారాణి, విద్యా వికాస్ కాలేజీ కరస్పాండెంట్​ శ్రీనివాసరావు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

తెలంగాణ దొరల గడిలో బందీ అయింది

మెండోరా, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పడు దొరల గడిలో బందీ అయ్యిందని బీజేపీ స్టేట్ లీడర్ మల్లికార్జున్‌‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తలపెట్టిన జనంతో మనం మహా పాదయాత్ర ఐదో రోజున మండలం కొడిచర్లలో కొనసాగింది. ముందుగా మండల కేంద్రంలో ఆయన పార్టీ జెండా ఎగురవేసి గడపగడపకు తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల దొరల గడిలో బందీగా మారిందని, ఆ దొర గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీయేనని అన్నారు. ఆయన వెంట జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, మెండోరా మండల ప్రెసిడెంట్ సాయరెడ్డి, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

బోధన్, వెలుగు: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధనాలపై ఏబీవీపీ కార్యకర్తలు పోరాటం చేయాలని ఆ సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి పిలపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఇందూరు బీఈడీ కాలేజీలో నిజామాబాద్, కామారెడ్డి, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు  చెందిన ఏబీవీపీ కార్యకర్తలకు విభాగ్ అభ్యసన వర్గ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి  మాట్లడుతూ ఏబీవీపీ ఇప్పటికే విద్యార్థి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి పరిష్కరించిందన్నారు. విద్యారంగమే కాకుండా ప్రజా సమస్యలపై కూడా తాము దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సామాజంలో దేశభక్తిని నింపే ఏకైక విద్యార్థి సంఘంగా ఏబీవీపీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రెండు రోజలు పాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రముఖ్​ రేంజర్ల నరేశ్‌‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యకుమార్, నాయకులు తలండి ఈశ్వర్, లక్ష్మణ్‌‌చౌహన్, గొడుగు వెంకటకృష్ణ, అనిల్‌‌ రెడ్డి, మనోజ్, మహేశ్‌‌ పాల్గొన్నారు.

బాల్కొండలో రాపిడ్ ‘యాక్షన్’ 

బాల్కొండ, వెలుగు: మండల కేంద్రంలో శనివారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్‌‌మెంట్ల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. బాల్కొండ బైపాస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీని ఆర్మూర్ సీఐ గోవర్ధన్‌‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఘర్షణలు, అల్లర్లు జరిగినప్పుడు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అవసరం ఎంతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్, ఆర్మూర్ సీఐ గోవర్ధన్‌‌రెడ్డి, బాల్కొండ ఎస్సై గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

టీఆర్ఎస్‌‌కు ప్రజలే బుద్ధి చెప్తరు

ఆర్మూర్, వెలుగు : టీఆర్‌‌‌‌ఎస్ లీడర్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ  దాడులకు దిగుతున్నారని, వీరికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆర్మూర్ బీజేపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు. శనివారం ఆర్మూర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్‌‌తో కలిసి మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఇష్టారీతిన మాట్లాడడం తగదన్నారు. ఇది తెలంగాణ సంస్కృతి కాదని, వెంటనే ఆమె ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గోవింద్‌‌పేట్ ఎంపీటీసీ రాజ్ కుమార్, బీజేపీ నాయకులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, ద్యాగ ఉదయ్, ఆకుల శ్రీను, మీసాల రాజేశ్వర్, కార్తీక్ సింగ్, మందుల బాలు, కలిగోట ప్రశాంత్, నరేశ్‌‌చారి, పసుపుల సాయికుమార్, పులి యుగంధర్,  గుగులోత్ తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ఇంటిపై దాడిని నిరసిస్తూ..

నిజామాబాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ ఇంటిపై టీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు చేసిన దాడిని బీజేపీ లీడర్లు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత, టీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీ ఇంటిపై భౌతిక దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ వారిని వెంటనే అరెస్టు చేయాలని పలువురు లీడర్లు డిమాండ్‌‌ చేశారు.

- వెలుగు, నెట్‌‌వర్క్‌‌