సైదిరెడ్డిపై నల్గొండ బీజేపీలో లొల్లి .. అభ్యర్థిని మార్చాలని డిమాండ్

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై రోజురోజుకి సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమను వేధించాడంటున్నారు స్థానిక బీజేపీ నేతలు. తమతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై కేసులు పెట్టాడని గుర్తు చేస్తున్నారు. ఎన్నోరకాలుగా తమను ఇబ్బంది పెట్టిన సైదిరెడ్డితో కలిసి పనిచేసేది లేదని చెబుతున్నారు. ఎంపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

 సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో గిరిజనుల భూములను ఆక్రమించారని సైదిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.  గుర్రంబోడు 540 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 1,876 ఎకరాల గిరిజనుల భూములను స్థానిక బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు బినామీ పేర్లతో ఆక్రమించారని, వీరి వెనుక సైదిరెడ్డి హస్తం ఉందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. 

దీంతో అక్రమణకు గురైన భూములను రక్షించేందుకు ‘గిరిజన భరోసా యాత్ర’ పేరుతో బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు నాయకులు గుర్రంబోడు పర్యటన చేపట్టారు. 540 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ నాయకులను నాడు ఎమ్మెల్యే హోదాలో సైదిరెడ్డి అడ్డుకోవడమే కాకుండా, లీడర్లపై భౌతిక దాడులు చేయించారు.