చలికి వణుకుతున్న ఢిల్లీ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

చలికి వణుకుతున్న ఢిల్లీ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • సఫ్దర్ జంగ్లో 4.9 డిగ్రీలు
  • బారెడు పొద్దెక్కినా తగ్గని పొగమంచు
  • చలిగాలులతో ఉక్కిరిబిక్కిరి
  • మొన్నటి దాకా కాలుష్యం.. ఇప్పుడు చలి వణికిస్తోంది
  • జమ్మూ కాశ్మీర్​లో మైనస్ 6 డిగ్రీలు

న్యూఢిల్లీ: మొన్నటి దాకా ఎయిర్ పొల్యూషన్​తో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ ప్రజలు.. ఇప్పుడు చలికి వణికిపోతున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీలో 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నార్త్ ఇండియా వ్యాప్తంగా ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీలో మాత్రం ఈ సీజన్​లోనే అత్యంత తక్కువ టెంమొన్నటి దాకా ఎయిర్ పొల్యూషన్​తో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ ప్రజలు.. ఇప్పుడు చలికి వణికిపోతున్నారు.

బుధవారం ఉదయం ఢిల్లీలో 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నార్త్ ఇండియా వ్యాప్తంగా ఎముకలు కొరికే చలితోపరేచర్ రికార్డు అయినట్లు భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. సఫ్దార్​జంగ్​లో 4.9 డిగ్రీలు, పాలమ్​లో 6.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ సిటీలో చాలా ఏరియాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. 9 గంటలు దాటినా పొగ మంచు తగ్గలేదు. 

కాగా, మంగళవారం ఢిల్లీలో 8 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా.. ఒక్కరోజులోనే 3 డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్రంగా పెరిగింది. నార్త్​వెస్ట్ నుంచి గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న గాలులే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమని ఐఎండీ అధికారులు తెలిపారు. రానున్న ఒకట్రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా నార్త్​వెస్ట్ ఇండియాలోని రాష్ట్రాల్లో చలి గాలులు వీస్తాయని చెప్పింది.

ఢిల్లీ ఏక్యూఐ 209 పాయింట్లు
పొద్దున 7 గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 209 పాయింట్లుగా నమోదైంది. ‘పూర్’ వెదర్​ కేటగిరిలోనే సిటీ ఉన్నదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) తెలిపింది. ఆనంద్ విహార్​లో ఏక్యూఐ 218, అశోక్ విహార్​లో 227, ద్వారకా 250, ఐజీఐ ఎయిర్​పోర్టు వద్ద 218 పాయింట్లుగా రికార్డ్ అయింది. అయానగర్ వద్ద 148, బురారీ క్రాసింగ్ వద్ద 187, చాందినీ చౌక్ వద్ద 181, డీటీయూ వద్ద 165 పాయింట్ల మోడరేట్ ఏక్యూఐ లెవల్స్ నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ఏక్యూఐ లెవల్స్ 224 పాయింట్లుగా రికార్డ్ అయింది.

రాజస్థాన్​లో పెరిగిన చలి
ఈస్ట్ ఇండియాలోని పలు ఏరియాల్లో రానున్న 24 గంటల్లో 4 డిగ్రీల టెంపరేచర్ తగ్గే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు, రాజస్థాన్​లో  చలి పెరిగింది. బుధవారం ఉదయం 8.30 గంటలైనా చలి తీవ్రత తగ్గలేదు. మంగళవారం రాత్రి సికర్​లో ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలకు పడిపోయిందని జైపూర్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

శ్రీనగర్లో మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్న టెంపరేచర్​
జమ్మూ కాశ్మీర్​లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్​లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వెచ్చగా ఉందని ఐఎండీ తెలిపింది. మరికొన్ని చోట్ల తడి వాతావరణం ఉన్నది. కాశ్మీర్ లోయలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం శ్రీనగర్​లో మైనస్ 3 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. గుల్​మార్గ్​లోని స్కీ రిసార్ట్ ఏరియాలో కనిష్టంగా మైనస్ 6 డిగ్రీలు నమోదైంది. మంగళవారంతో పోలిస్తే ఇక్కడ మూడు డిగ్రీలు పెరిగింది.