తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రతకు జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడడం.. శీతల గాలులు వీయడం.. పొగ మంచు దట్టంగా పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల తగ్గి చలి ప్రభావం పెరిగింది. ఉదయం 9 వరకు చలి గాలులు వీస్తున్నాయి.చలి తీవ్రతతో పిల్లలు, వృద్దులు, మహిళలు 9 గంటలు దాటిన బయటికి రాలేకపోతున్నారు.
పొగ మంచుతో రహదారులు కనబడకుండా ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. వాహనదారులు వాహనాలను నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు చలి తీవ్రత ఉంటుందని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు చలిమంటలు వేసుకుని చలి నుంచి రక్షణ పొందుతున్నారు.