సింగరేణి, ఎన్‌ఎండీసీ మధ్య సహకారం

సింగరేణి, ఎన్‌ఎండీసీ మధ్య సహకారం

హైదరాబాద్, వెలుగు: క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లో పరస్పరం సహకారం అందజేసుకోవాలని సింగరేణి, ఎన్ఎండీసీ నిర్ణయించుకున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో ఆ సంస్థ సీఎండీ అమితావ ముఖర్జీతో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లో ఎన్‌ఎండీసీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘‘క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లోకి అడుగు పెట్టేందుకు సింగరేణి సిద్ధమవుతున్నది. ఈ రంగంలో గత 60 ఏండ్లుగా అనుభవం ఉన్న ఎన్ఎండీసీతో కలిసి పనిచేస్తాం. అలాగే ఈ రంగంలో మేధోవిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఐఐటీ- హైదరాబాద్‌తో ఒప్పందం చేసుకున్నాం” అని చెప్పారు.