
- పక్క భవనం నుంచి కిందకు
జిన్నారం, వెలుగు : జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్ లో గురువారం ఓ మూడంతస్తుల భవనం మెట్లు ఒక్కసారిగా కులాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పక్కనే ఉన్న మరో భవనంపైకి ఎక్కి ఆ బిల్డింగ్‌లోని పై రెండు అంతస్తులలో నివసిస్తున్న వారిని కిందకు దించారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని ఏడాది కింద మున్సిపల్ కమిషనర్ సదరు భవన యజమాని కరుణాకర్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ మున్షి నవీన్ తెలిపారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని కిరాయిదారులకు అధికారులు సూచించారు.