మాదాపూర్ .. సిద్దిక్ నగర్ లో ఐదంస్తుల భవనాన్ని కూల్చాలని హైడ్రా మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. బిల్డర్ చేసిన తప్పిదానికి అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బంది పడాల్సివస్తుంది. భవనాన్ని నిర్మించే సమయంలో పిల్లర్ల నిర్మాణం లోతునుంచి చేపట్టకపోవడంతో పక్కకు ఒరిగింది. అయితే ప్రస్తుతం ఆ భవనం పక్కనే మరో భవనాన్ని నిర్మించే క్రమంలో పిల్లర్ల నిర్మాణం కోసం గోతులు తీశారు. దీంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగింది. సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి.. హైడ్రా DRF బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఐదంస్తుల భవనం కుంగడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే ఈ భవన చుట్టు పక్కల ఇళ్లలో ఉన్న ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. అయితే కుంగిన అపార్ట్ మెంట్ లో ఉండేవారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామాల్లోని ఆస్తులు అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేసిన తరువాతే కూల్చాలంటున్నారు అపార్ట్ మెంట్ వాసులు. పక్కస్థలంలో కనస్ట్రక్షన్ చేసే వారు తప్పిదం వల్ల మా బిల్డింగ్ కుంగిందని తెలిపారు. అధికారులు హైడ్రాలిక్ యంత్రాలతో సిద్దంగా ఉన్నారు.