
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఓ పంచాయతీ ఆఫీస్బిల్డింగ్ కుప్పకూలింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కౌటాల మండలంలో కొత్తగా ఏర్పాటైన వీరవెళ్లి గ్రామ పంచాయతీకి సొంత బిల్డింగ్లేకపోవడంతో అధికారులు పాత గవర్నమెంట్స్కూల్బిల్డింగులోని ఓ గదిని కేటాయించారు. మరో గదిలో అంగన్వాడీ స్కూల్నడుస్తోంది.
బిల్డింగ్శిథిలావస్థకు చేరడంతో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా నానింది. గురువారం ఉదయం11 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఒక్కసారి పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. ఆ టైంలో బిల్డింగ్ లోపల, పరిసరాల్లో ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. అంగన్వాడీ టీచర్ల సమ్మె నడుస్తుండడంతో సెంటర్ ను ఓపెన్చేయలేదు. భారీ వర్షం కారణంగా పంచాయతీ ఆఫీసుకు సైతం ఎవరూ రాలేదు.