- రూ.3.40 లక్షలు అందించిన తోటి ఉద్యోగులు
సికింద్రాబాద్, వెలుగు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పి. నరసింహరాజు కుటుంబానికి తోటి కానిస్టేబుల్స్ రూ. 3.40 లక్షలు ఆర్థికసాయం చేశారు. బోడుప్పల్ నారపల్లికి చేసిన పి.నరసింహ రాజు 2009లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. భార్య , ఇద్దరు బిడ్డలతో కలిసి నారపల్లిలో ఉంటున్నాడు.
హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్లలో డ్యూటీ చేశాడు. సికింద్రాబాద్ లోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ కొద్ది రోజుల కింద ఆర్థిక సమస్యలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న 2009 బ్యాచ్‌కు చెందిన 700 మంది కానిస్టేబుల్స్ నరసింహ రాజు కుటుంబానికి ఏదైనా చేయాలనుకున్నారు. అందరూ కలిసి రూ.3.40 లక్షలను పోగు చేసి చెక్కును నరసింహారాజు కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు.