- దంపతులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు : చిట్టీల పేరిట బిజినెస్ చేసి పలువురికి రూ. కోట్లలో టోపీ పెట్టిన దంపతులు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్తెలిపిన ప్రకారం.. చింతల్‌కు చెందిన మేకల నాగమణి, నాగ మున్నయ్య దంపతులు తమ కుటుంబసభ్యులు గురుస్వామి రంగనాయకులతో కలిసి స్థానికంగా 2006 నుంచి చిట్టీల బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఇదే కాలనీలో ఉండే కె. భవానితో పాటు మరో 35 మంది నాగమణి వద్ద చిట్టీలుగా..
రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు కట్టారు. దీంతో పాటు కాలనీలో ఉండే వారి వద్ద దంపతులు ఎక్కువ వడ్డీ ఇస్తామని భారీగా డబ్బులు తీసుకున్నారు. కొంతకాలంగా వారికి డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒక సాకు చెబుతూ వస్తున్నారు. గత నెల 4న దంపతులు పారిపోయారు. దీంతో మోసపోయిన బాధితుల్లో భవాని సైబరాబాద్పోలీసులకు కంప్లయింట్ చేశారు.
సైబరాబాద్ఎకనామిక్ అఫెన్స్వింగ్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..35 మంది నుంచి 4.15 కోట్లు వసూలు చేసినట్టు తేలింది. ఆ డబ్బులతో జీడిమెట్ల, చింతల్ ఏరియాల్లో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ‘మెకానిక్’ పేరుతో సినిమా కూడా నిర్మించారు. శుక్రవారం దంపతులను సైబరాబాద్ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.