అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకర్లు గుర్తించాలి : అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్​, వెలుగు: జిల్లాలో అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకర్లు గుర్తించాలనిజిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్​లో జిల్లాస్థాయిలో బ్యాంకర్లతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.50వేల నుంచి  రూ.10 లక్షల మధ్య డబ్బుల లావాదేవీలు జరిగితే కచ్చితంగా రసీదు ఉండాలన్నారు.  రూ.10,లక్షల పైన లావాదేవీలు ఉంటే ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు.

జిల్లాలో ఏటీఎంల్లో డబ్బులు నింపేందుకు వచ్చే సెక్యూరిటీ వ్యాన్లను  ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించాలంటే తెలంగాణ సీఈవో నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. లాకర్స్ లో గోల్డ్ ను పర్యవేక్షించి, క్యాష్ జనరేట్ చేయడానికి క్యూఆర్ కోడ్ ను ఉపయోగించాలని, వెహికల్ నంబర్ లను తనిఖీ చేయాలని  తెలిపారు.ప్రతి రోజూ క్యాష్ డిపాజిట్ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.

అడిషనల్​ కలెక్టర్​ లు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్ ..  అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లతో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, ఎన్నికల విధులలో వివిధ ఎమర్జెన్సీ డిపార్ట్​మెంట్​ ప్రాముఖ్యత , ఇతర అంశాలపై మాస్టర్ ట్రైనర్ రాముతో శిక్షణ తరగతులు నిర్వహించారు,ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, జిల్లా లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ ఆర్. సత్యనారాయణ మూర్తి ,వివిధ బ్యాంక్​ మేనేజర్లు, ఎలక్షన్ సూపరింటెండెంట్​ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.