యాదాద్రి, వెలుగు: ఈనెల 12 న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి 19 ఏండ్ల వారికి అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలని కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 901 అంగన్వాడీ కేంద్రాలు, 647 ప్రభుత్వ , 146 ప్రైవేట్ పాఠశాలలు, 38 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ , 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు సంబంధించి మొత్తం 1,61, 650 మంది పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలన్నారు.
ఆ రోజు మిస్సైన వారికి ఈ నెల 19న టాబ్లెట్లు వేయాలని సూచించారు. ఒకటి నుంచి 2 ఏండ్ల పిల్లలకు సగం టాబ్లెట్, 2 నుంచి 19 ఏండ్ల పిల్లలకు ఒక మాత్ర వేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ యశోద, డీఈవో కె.నారాయణరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి అన్నపూర్ణ, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వినోద్ ఉన్నారు.