పార్లమెంట్‌ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకం : హరిచందన  

నల్గొండ అర్బన్, వెలుగు: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ హరిచందన  చెప్పారు.  సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు  20 మంది జిల్లా అధికారులను నోడల్ ఆఫీసర్లు నియమించినట్లు తెలిపారు. సీనియర్ సిటీజన్లు, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగ ఓటర్ల హోమ్ వోటింగ్ విధానం, ఓటు హక్కు ప్రాధాన్యతపై కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు.

మంచి డిజైన్లతో మోడల్‌ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,  సీ-విజిల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు తదితర అంశాలపై  చర్చించారు. ఈ సమావేశంలో  అడిషనల్‌ కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పీ రాములు నాయక్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వర రావు, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు. 

 పీఎం విశ్వకర్మకు దరఖాస్తు చేసుకోవాలి  

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అర్హులైన చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ పథకంపై  నిర్వహించిన ఒక రోజు సెమినార్‌‌లో ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద  కేవలం 5 శాతం వడ్డీకి రుణాలు పొందవచ్చని, సబ్సిడీ కూడా ఉంటుందని చెప్పారు.

ALSO READ : జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత  శిక్షణతో మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.  జిల్లాలో ఇప్పటి వరకు 11 వేల మంది నమోదు చేసుకున్నారని, ఇంకా అర్హులు ఉంటే వెంటనే  నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఎంఎస్ఎంఈ  కో-ఆర్డినేటర్ నవీన్, మెప్మా పీడీ కరుణాకర్, మహిళాశిశు సంక్షేమ ఆఫీసర్ కృష్ణవేణి, 18 కులవృత్తుల సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.