ములుగు, వెలుగు : ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం కిచెన్ షెడ్లను ఈనెల 7 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇంచర్ల, చల్వాయిలో నిర్మిస్తున్న కిచెన్ షెడ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అంకిత్, ఈఈ హేమలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి : కలెక్టర్
జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, జిల్లా ప్రజలకు సూచించారు. మంగళవారం ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్ కలెక్టర్‌ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ సంవత్సరంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మేడారం మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు.