
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్రాహుల్రాజ్హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, ఎలక్షన్ కోడ్ కఠినంగా అమలయ్యేలా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ పార్టీల, నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలు తొలగించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలు, హోమ్ఓటింగ్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ రాహుల్రాజ్దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మెదక్అడిషనల్కలెక్టర్వెంకటేశ్వర్లు, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గరిమ అగర్వాల్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశీ, ఎలక్షన్ సూపరింటెండెంట్హరిదీప్సింగ్తదితరులు పాల్గొన్నారు.