ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు : రాజర్షి షా

ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​జిల్లాలో అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్​రాజర్షి షా హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్​లో  అధికారులతో మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ మట్టి రవాణా నివారణకు డివిజన్ల వారీగా మూడు టీమ్స్​ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో టీమ్​లో సంబంధిత ఆర్డీఓ, తహసీల్దార్లు,  భూగర్భ జలశాఖ అధికారులు, ఇరిగేషన్ ఈఈ, డీఎస్పీలు, మోటర్ వెహికల్​ఇన్స్​పెక్టర్లు సభ్యులుగా ఉంటారని వివరించారు.

సమన్వయంతో అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. అలాగే ప్రైవేట్​ట్రాన్స్​పోర్టు కార్మికులు, ఆటో, ప్రైవేట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందచేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో  ఆటో రంగం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.