ఇసుక ట్రాక్టర్లను జీపీఎస్​తో అనుసంధానించాలి : రిజ్వాన్ బాషా షేక్

ఇసుక ట్రాక్టర్లను జీపీఎస్​తో అనుసంధానించాలి : రిజ్వాన్ బాషా షేక్

జనగామ, వెలుగు : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ట్రాక్టర్లకు జీపీఎస్​ అనుసంధానించాలని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఆఫీసర్లను ఆదేశించారు. చెన్నూరు రిజర్వాయర్ నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక మంజూరీ కోసం గురువారం కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాల్​ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.  దేవరుప్పుల మండలం రంభోజీగూడెం వద్ద చెన్నూరు రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఇసుక కేటాయింపులకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా ను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్  రోహిత్ సింగ్,  మైనింగ్​ ఏడీ జగన్మోహన్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్​ శ్రీనివాసరావు , ఇరిగేషన్ ఈఈ ప్రవీణ్   పాల్గొన్నారు.

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ధరణి పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని   కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్​ కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి రెవెన్యూ  అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  జిల్లాలో మొత్తం  4357 పెండింగ్​ దరఖాస్తులు ఉండగా వీటిలో జనగామ డివిజన్​ లో 3173, స్టేషన్​ ఘన్పూర్ డివిజన్ కు సంబంధించినవి 1184 ఉన్నట్లు చెప్పారు. ఇందులో జనగామలో 2384, ఘన్​ పూర్ లో 1059 దరఖాస్తులు పరిశీలన జరిగిందన్నారు. మిగిలిన 914 దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.