వనపర్తి, వెలుగు: విద్యా ప్రణాళికలు ప్రతి స్కూల్లో తప్పకుండా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, జీహెచ్ఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి, లక్ష్య, టీచర్స్, స్టూడెంట్ల హాజరు శాతం తదితర అంశాలపై రివ్యూ చేశారు. ఎంపీడీవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు నిరంతరం తమ పరిధిలోని స్కూళ్లను పర్యవేక్షించాలని, అలసత్వం జరిగితే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్టూడెంట్ల హాజరు శాతం 85 శాతం కంటే ఎక్కువ ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అధికారులు పాల్గొన్నారు.