ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్ నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ నుంచి గట్టమ్మ వరకు సైకిల్ ర్యాలీని అడిషనల్కలెక్టర్లు శ్రీజ, మహేందర్‌జీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ జరగాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ర్యాలీలో భాగంగా అడిషనల్ కలెక్టర్ శ్రీజ చిన్నారులతో కలిసి సైకిల్ తొక్కుతూ ఉత్సాహ పరిచారు. ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డీపీఎం సతీశ్, డీసీవో సర్ధార్‌సింగ్, తహసీల్దార్విజయ్భాస్కర్, సైక్లింగ్చిన్నారులు, యువకులు
పాల్గొన్నారు.