ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : వల్లూరి క్రాంతి

ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : వల్లూరి క్రాంతి

మెదక్, వెలుగు:  ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్​కలెక్టర్​ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు.  మొత్తం100 అర్జీలు రాగా అందులో  రెవెన్యూ శాఖకు సంబంధించినవి 35, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 11, ఇతర శాఖలకు సంబంధించి 54  ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటిదాకా జిల్లా నుంచి ఎన్ని అర్జీలు వచ్చాయి.

వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అందుకు సరైన కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన వారు పదే పదే  రాకూడదని, ప్రాధాన్యం బట్టి వెంటనే పరిష్కరించాలని, లేనట్టయితే కారణాలు తెలపాలన్నారు. అప్పుడే ప్రజావాణి పై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు.  ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు​రమేశ్, వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి టౌన్:  ప్రజావాణికి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్  క్రాంతి అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో అధికారులతో కలిసి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. దాదాపు 100 అర్జీలు రాగా ఇందులో ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్లు, దళితబంధు స్కీమ్​కు సంబంధించి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో..

సిద్దిపేట టౌన్: ప్రజావాణి వినతులను పెండింగ్​లో పెట్టొద్దని అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్​ఆఫీసులో అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 59 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇందులో భూ సంబంధిత, ఆసరా పింఛన్లు, డబుల్​బెడ్​రూంల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.