సర్పంచ్ నుంచి ఫండ్స్ రికవరీ చేయండి : వెంకట్‌‌రావు

  • మేళ్ల చెరువు తహసీల్దార్‌‌‌‌కు కలెక్టర్ ఆదేశం

మేళ్లచెరువు, వెలుగు: మేళ్లచెరువు జీపీలో దుర్వినియోగమైన నిధులను సర్పంచ్ నుంచి రికవరీ చేయాలని కలెక్టర్ వెంకట్‌‌రావు శుక్రవారం తహసీల్దార్‌‌ జ్యోతికి ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 5న కోదాడ ఆర్డీవో ఆధ్వర్యంలోని టీమ్‌‌ మేళ్లచెరువు జీపీలో ఆకస్మిక తనిఖీలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ రికార్డుల పరిశీలనలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది.

14,15 ఫైనాన్స్ ఫండ్స్ నుంచి రూ. 63,30 ,021, ఆర్థిక సంఘం ఫండ్స్ నుంచి రూ. 43,16 ,086, జనరల్ ఫండ్స్ నుంచి రూ. 99,66 , 005.. మొత్తం రూ. 1,99,12,112  దుర్వినియోగం అయినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో పంచాయితీ రాజ్ యాక్ట్ ప్రకారం 45 రోజుల్లో సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి నుంచి రికవరీ చేసి.. జీపీ అకౌంట్‌‌లో జమ చేయాలని కలెక్టర్‌‌‌‌ ఆదేశించారు.