మున్సిపాలిటీల్లో అన్ని సేవలు ఆన్ లైన్ చేసిన సర్కార్

  • మున్సిపాలిటీల్లో  ‘రివిజన్​ నకళ్ల’ దందా
  • తీర్మానం చేసుకొని మరీ డబ్బులు గుంజుతున్న మున్సిపాలిటీలు 
  • టీఎస్‌బీపాస్  వచ్చిన తిప్పలు తప్పట్లే
  • మున్సిపాలిటీల్లో అన్ని సేవలు ఆన్ లైన్ చేసిన సర్కార్ 
  • మూడేళ్ల క్రితమే మ్యాన్ వల్ ఇవ్వొద్దుంటూ సర్క్యూలర్

జగిత్యాల, వెలుగు : మున్సిపాలిటీల్లో మళ్లీ  వసూళ్ల దందా కొనసాగుతోంది. ఇంటి పర్మిషన్, బ్యాంక్ లోన్ ఇతర పనుల కోసం ప్రాపర్టీ టాక్స్ అసెస్ ‌ ‌‌మెంట్​సర్టిఫికేట్స్ తప్పనిసరి కావడంతో మున్సిపాలిటీల్లో రివిజన్​ నకళ్ల(అటెస్టెడ్​ జిరాక్స్)​ పేరిట డబ్బులు గుంజుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్​ అసెస్మెంట్​నకళ్ల కోసం ఓ రేట్​ఫిక్స్​ చేసుకొని వసూల్​ చేస్తున్నారు. దీనికోసం మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేయడం గమనార్హం. వెబ్ సైట్ అప్​డేట్.. సేవలు పాతవే మున్సిపల్ యాక్ట్ -2019 లో భాగంగా డీపీఎంఎస్ వెబ్ సైట్ ను క్లోజ్​ చేసి సర్కార్​ టీఎస్ బీపాస్  ‌‌ ‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఈసీ, మార్కెట్ వాల్యూ, మాస్టర్ ప్లాన్, ప్రొహిబిషన్ లిస్ట్, నాలా వంటి వాటిని కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ (సీడీఎంఏ) వెబ్  ‌‌ ‌‌సైట్ అప్ డెట్ చేసింది. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ అసెస్  ‌‌ ‌‌మెంట్లను కొత్తగా ఏర్పాటు చేసి టీఎస్​బీపాస్​ వెబ్ సైట్ లో పొందుపరిచారు. వీటిని బుక్ లేట్ రూపంలోకి మార్చి స్టేట్ లోని అన్ని మున్సిపాలిటీలకు పేజీ నంబర్ల తో సహా అప్పగించారు. 

మ్యాన్ వల్  ‌‌ ‌‌గా ఇవ్వొద్దని ఆదేశాలు 

టీఎస్ బీపాస్ వెబ్ సైట్ లో ఇంటి పర్మిషన్ కోసం అప్లై చేస్తే 1985 కు చెందిన అసెస్  ‌‌ ‌‌మెంట్(గ్రామ కంఠం, ఆబాది),  ఎల్ఆర్ఎస్,  నాన్ ఎల్ఆర్ఎస్  కేటగిరీలు అడుగుతోంది. ఈ మేరకు అన్ లైన్ లో ఉన్న పీడీఎఫ్ కాపీ అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అప్లికేషన్ ను షార్ట్ లిస్ట్  కింద మ్యాన్  ‌‌ ‌‌వల్  ‌‌ ‌‌గా ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ కాపీలు జతచేయలేదని రిజెక్ట్ చేస్తున్నారు. మరో వైపు బ్యాంక్ లోన్ కోసం అసెస్మెంట్ కాపీలను అడగొద్దని మున్సిపల్ ఆఫీసర్లు బ్యాంకర్ల తో మీటింగ్ జరిపినా మ్యాన్  ‌‌ ‌‌వల్​అసెస్​మెంట్​ కాపీలు అడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల వసూళ్ల పర్వం సాగుతోందని ప్రజలు అంటున్నారు. 

ఒక్కోచోట ఒక్కో రేటు 

జగిత్యాల మున్సిపల్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ రివిజన్ ధరఖాస్తు దారుల నుంచి ఇంటి స్థలాన్ని బట్టి 100 గజాలు, ఆపై వాటికి రూ. వెయ్యి, 200 గజాలు, ఆపై రూ. 3 వేలు, 300 గజాలు, ఆపై వాటికి రూ. 5 వేలు వసూల్ చేస్తున్నారు. అదే కమర్షియల్ బిల్డింగ్ అయితే 100 గజాలకు రూ. 3 వేలు, 200 గజాలకు రూ. 5 వేలు వసూల్ చేస్తున్నారు. కోరుట్ల పరిధిలో ఇంటికి ఒక ఏడాది  అసెస్మెంట్ కాపీకి రూ.500 , ఓనర్ కాకుండా థర్డ్ పార్టీకి రూ. వెయ్యి వసూలు చేస్తున్నారు. మెట్  ‌‌ ‌‌పల్లిలో రివిజన్ అసెస్మెంట్ కోసం రూ. 2వేలు తీసుకుంటున్నారు. 
మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్, బ్యాంకర్లు తప్పనిసరిగా మ్యాన్  ‌‌ ‌‌వల్​ఇవ్వాలని పట్టణ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  మరోవైపు ఎలాంటి మ్యాన్  ‌‌ ‌‌వల్​సర్టిఫికేట్లు ఇవ్వకూడదని ఉన్నతాధికారులు సర్క్యులర్లు ఇచ్చినా పాలకవర్గాలు, కింది స్థాయి సిబ్బంది  పట్టించుకోకపోవడం లేదు. 

ప్రజలు ఇబ్బందులు పడతారనే ఇస్తున్నాం.. 

ఇండ్ల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ ​​కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో మున్సిపల్ పాలకవర్గం తీర్మానం మేరకు అసెస్  ‌‌ ‌‌మెంట్​ రివిజన్ కాపీలు ఇస్తున్నాం. సర్క్యూలర్ మేరకు ఓనర్ షిప్, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్ ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఇతర డాక్యుమెంట్స్ కూడా కొన్ని రోజులు జారీ చేయడం నిలిపివేయడంతో దరఖాస్తుదారులు సహ చట్టం దరఖాస్తు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుందని తీర్మానం చేయడంతో రివిజన్ కాపీలు అటెస్టెడ్​చేసి మంజూరు చేస్తున్నాం.   జగదీశ్‌‌, మెట్‌‌పల్లి కమిషనర్​