
నిజాంపేట, వెలుగు: మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం వివరాలను సేకరించడానికి 15 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లు పని చేస్తున్నారన్నారు. వారు దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారన్నారు. ఆయన వెంట టెక్నికల్ ఏవో సతీశ్, ఏఈవోలు శ్రీలత, కావేరి, గణేశ్ ఉన్నారు .