జాబ్స్ పేరిట వసూళ్లు.. ఆరుగురిపై కేసు నమోదు, ఇద్దరు అరెస్ట్‌‌‌‌

జాబ్స్ పేరిట వసూళ్లు..   ఆరుగురిపై కేసు నమోదు, ఇద్దరు అరెస్ట్‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు : హోంగార్డు, ఏఎన్ఎంతో పాటు కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి, ఫేక్‌‌‌‌ జాయినింగ్‌‌‌‌ లెటర్స్‌‌‌‌తో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను మిర్యాలగూడ వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజశేఖరరాజు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాళ్లపల్లి శ్రీధర్‌‌‌‌ స్థానిక విద్యానగర్‌‌‌‌లో రెండేండ్ల కింద గ్రామీణ ఉద్యోగ సేవా కేంద్రం ఏర్పాటు చేశాడు. 

తర్వాత ఏపీలోని నంద్యాలకు చెందిన రాసపుత్ర రాఘవేందర్‌‌‌‌ అలియాస్‌‌‌‌ రాజుతో కలిసి హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఖాసీం అనే వ్యక్తికి ఏజెంట్‌‌‌‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో హోంగార్డులు, కాంట్రాక్ట్, ఏఎన్ఎం, ఆపరేటర్‌‌‌‌ పోస్టులు ఇప్పిస్తానంటూ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలకు చెందిన 9 మంది నిరుద్యోగుల నుంచి రూ. 45.10 లక్షలు వసూలు చేసి అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెటర్స్‌‌‌‌ ఇచ్చారు. 

ఆ ఆర్డర్లు ఫేక్‌‌‌‌ అని తెలియడంతో బాధితులు సదరు వ్యక్తుల కోసం వెతుకుతుండగా వారు తప్పించుకొని తిరుగుతున్నారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన వేముల వంశీ అనే వ్యక్తి హోం గార్డు జాబ్‌‌‌‌ కోసం రూ. 12 లక్షలను నిందితులకు ఇచ్చాడు. వంశీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం శ్రీధర్, రాఘవేందర్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసి రూ. 1.50 లక్షలు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాసీంతో పాటు అతడికి సహకరించిన ఎడ్ల చంద్రయ్య, రాళ్లపల్లి నారాయణ, రాళ్లపల్లి పర్వతమ్మ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో మిర్యాలగూడ టూటౌన్‌‌‌‌ సీఐ నాగార్జున, వన్‌‌‌‌టౌన్‌‌‌‌ ఎస్సై సైదిరెడ్డి ఉన్నారు.